ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యస్ బ్యాంక్.. 2,500 మంది తొలగింపు!

పేలవమైన పనితీరు, డిజిటలైజేషన్ ల ప్రభావంతో బ్యాంకులు తమ ఉద్యోగులకు భారీగా కోతలు పెడుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత మరో బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల కోతను విధించింది. అధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న యస్ బ్యాంక్ ఉద్యోగాలకు కోత విధించడం ఇది రెండోసారి. తాజాగా 10 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించింది. దీంతో దాదాపు 2,500 మంది ఉద్యోగాలను కోల్పోయారు. రెడండెన్సీని తగ్గించుకోవడానికే ఉద్యోగాల కోతను చేపట్టామని బ్యాంకుకు సంబంధించి వ్యక్తులు తెలిపారు. ఇదే సమయంలో అత్యున్నత విద్యాసంస్థల నుంచి ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 
Go Back to Shorts
yes bank
layoffs in yes bank

More Telugu News